తేనెధారలు
దేవుని పనిని ఆపకుండును గాక !
‘‘అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి’’ (అ.కార్య 14:2)
ఈకొనియ అనేది అన్యజనుల పట్టణమైనను అక్కడ యూదులు నివసించు ఒక బలమైన ప్రదేశముండెను. అక్కడ వారికి ఒక సమాజ మందిరముండెను. పౌలు మరియు బర్నబాలు అక్కడికే వెళ్ళి యూదులకు అలాగే అన్యజనులకు కూడా సువార్త ప్రకటించిరి. అప్పుడు అక్కడ వెనువెంటనే ప్రతిస్పందన వచ్చినది. వారు చెప్పినది విని అనేకమంది విశ్వసించిరి. అయితే వ్యతిరేకత కూడా చెలరేగెను. విశ్వాసము, అవిశ్వాసముతో విభేదించెను. విశ్వసించిన యూదులు, గ్రీకులు సువార్తను నమ్మని యూదులు, గ్రీకుల ప్రవర్తన, క్రియలతో విభేదించినట్లు ఇక్కడ మనము చూచుదుము. ఈ ఆత్మీయ వ్యతిరేకత ఆకాశమండలమందలి సాతాను శక్తుల చేతనే రేకెత్తించబడెననుటకు ఏ సందేహమును లేదు. ‘‘సువార్తకు పోటీగా’’ పనిచేయుటలో సాతాను ఆరితేరినవాడు. సువార్తను సరైన విధంగా బోధించుటకువాడు ద్వేషించును. అంతేకాదు దానికి ఆటంకం కలిగించకుండా ఉండలేడు. మనము దేవునితో సహవాసము చేయుచు నడుచుకొనుచు, ఆయన ఆత్మపై ఆధారపడినప్పుడు ఆశ్చర్యకరమైన ఏ సంగతులు జరుగునో మనకు తెలియదు - మనకు తెలియని ఒక ద్వారము మన ఎదుట తెరవబడవచ్చు, గనుక మనమెన్నడు ఊహించని విధముగా సాక్ష్యమిచ్చుటకు ఒక అవకాశము కలుగును. మరొక ప్రక్క అపవాది కూడా సువార్త వ్యాపించకుండా ఆపుటకు తన కుయుక్తులనుపయోగించును. కానీ పౌలు, బర్నబాల ఆసక్తిని వ్యతిరేకత అణచివేయలేదు, సరికదా క్రీస్తు కొరకు ఫలించుటకు వారిని మరింత దృఢముగా పనిచేయగలిగిరి. వారు మాట్లాడునప్పుడు విశ్వాసము ద్వారా ప్రభువుపై ఆనుకొనిరి. వారు పిరికివారుగా ఉండక వ్యతిరేకతను మరింత ధైర్యముతో ఎదుర్కొనిరి.
ప్రియ మిత్రులారా, మనకు వ్యతిరేకతలు ఎదురైనప్పుడు వెనుకకు తగ్గక అపవాది కుయుక్తులకు ఎదురు నిలిచి దేవుని ఆత్మమీద ఆధారపడి అవకాశాలు కలిగినప్పుడెల్ల ప్రకటించుచునే యుందము.
ప్రార్ధన:- ఆత్మస్వరూపిjైున దేవా, క్రీస్తు సువార్త ప్రకటించునప్పుడు సాతాను ఎల్లవేళల బలంగా ఆటంకపరచునని గ్రహించితిని గనుక భయపడక నీ వాక్యము ప్రకటించు కృపనిమ్ము. నాశక్తి, జ్ఞానము మీద ఆధారపడక పూర్తిగా కేవలం పరిశుద్ధాత్మ మీదనే ఆధారపడి నిబద్ధతతో నీ పనిచేయుటకు ధైర్యమును నాకనుగ్రహించుమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రీ, ఆమెన్.
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com
Comments