02, మార్చి 2025 ఆదివారము || శనివారము
- Honey Drops for Every Soul
- Mar 2
- 1 min read
చదువుము : ప్రకటన గ్రంథం 2:26-29
మనము క్రీస్తునందు జయించువారుగా ఉందము
‘‘దేవుని మూలముగా పుట్టినవారందరు లోకమును జయించుదురు...’’ - 1 యోహాను 5:4
లోకమును జయించునది ఏమిటి ? చార్లెస్ జి. ఫిన్నీగారు ఇలా జవాబిచ్చిరి. మొదటిగా, ఈ లోకాన్ని ఆవరించియున్న మోసపుచ్చు ఆత్మను అధిగమించుటకే. ఈ లోక సంపద వెంబడి పరుగులు దీయు ఈ ఆత్మను మనము జయించకపోతే మరి దేని చేతను జయించలేము. రెండవదిగా, లోకము యొక్క ఆకర్షణలను అధిగమించి జయించుటను సూచించుచున్నది. ఈ లోకస్థులు ఆస్తిపాస్తులను సంపాదించుటలోను, ఈ లోకజ్ఞానమును పొందుటలోను, సుఖభోగాలయందును ఆసక్తి కలిగి వాటిలో మునిగి తేలుచుందురు. దేవుని పిల్లలమైన మనము ఈ లోకార్షణలనే కాక లోకమునే మరియు మనుష్యుని హృదయాన్ని ప్రలోభపెట్టువాటిని కూడా ఖచ్చితంగా జయించవలెను. మూడవదిగా, లోక భయమును జయించుట లోకమును జయించుటను సూచిస్తుంది. అనేకులు ఈ లోక భయముచేత ప్రభావితం చేయబడుచుందురు. ఈ లోకస్థులేమను కొనుచున్నారోయని, కొందరు వారి మనస్సాక్షిని బట్టి ప్రవర్తింపక వారి ముఖకవళికలు వేరుగా చూపుదురు. వారొకవేళ సత్యము కొరకు నిలిచినట్లయితే వారి ప్రతిష్ఠ దెబ్బ తినునేమోయని భయపడుచుందురు. ‘‘మనుష్యులకు భయపడుటకంటే దేవునికి భయపడుటయే’’ ముఖ్యమని మనము గుర్తుంచుకొనవలెను. నాల్గవదిగా, లోకపరమైన కలవరమును జయించుట ఈ లోకమును జయించుటను చూపుచున్నది. ఈ లోకపరమైన వాటిపై మన దృష్టియుంచి, దేవుని నమ్మికయు ఆ తండ్రి హస్తాలనుండి సమస్త మేళ్ళను పొందుటను తెలిసికొననట్లయితే దానంతట అదే ఈ లోకచింతల భారము మనపై పడును. తుదకు అవి మన మీద పెత్తనము చేయును.
ప్రియ మిత్రులారా, దేవుని వలన పుట్టినవారమైతేనే మరియు మన ఆత్మలయందు నిజమైన అంచనా కలిగియుంటేనే మనమీలోకమును జయింపగలము. అలా చేసినప్పుడే, మనమీ అశాశ్వతమైన లోకసంబంధమైన వాటిని త్యజించి మహిమాన్వితమైన పర సంబంధమైన విషయాలను వెదకగలము.
ప్రార్ధన:- ప్రియ ప్రభువా, జయించుటకు నాకు నీ కృపననుగ్రహించుము. దురాశపరునిగా గానీ, మోసకరమై వాటిని ఆశింపకయు, లోకము, దాని సంబంధమైన వాటిని ఆశించువానిగా ఉండక, మనుష్యులకు భయపడక వారికంటె నీకు ఎక్కువగా భయపడి చింతలు, కలవరములను తొలగించుకొని పరసంబంధమైన వాటి మీదనే దృష్టియుంచుటకు సహాయము చేయుమని యేసు నామమున వేడుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com
Comments