02, ఏప్రిల్ 2025 బుధవారము || మనసును బాధించుట, దేహమును
- Honey Drops for Every Soul
- Apr 2
- 1 min read
తేనెధారలు చదువుము : లేవీ కాం. 23:26-32
‘‘ఇప్పుడైనను మీరు ఉపవాసముండి, కన్నీరు విడుచుచు దు:ఖించుచు మన:పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి’’ - యోవేలు 2:12
వాస్తవానికి ఉపవాసమనగా మనలను మనము దేవుని ఎదుట తగ్గించుకొని, ఆహారమును త్యజించి మన దేహమును స్వాధీనపరచుకొని, మన ఆత్మను నలుగ గొట్టుకొనుట అని అర్థము. అన్నిటిని మించి, అది దేవునితో సమయం గడుపుట. హెబ్రీ భాషలో దీని అసలైన మాట సుమ్ (ప్రాణమును ఆయాసపరచుకొనుట) అనియు గ్రీకులో నెస్టెయా (ఆహారమును త్యజించుట) అని అందురు. పాత నిబంధన క్రింద దేవుడు ఇశ్రాయేలీయుల కొరకొక ప్రత్యేకమైన దినమును సం॥న కొకసారి వారి ప్రాణములను ఆయాసపరచుకొనుటకు ప్రయత్నించెను, అది ప్రాయశ్చిత్తార్థ దినము. లేవీ కాం. 23:27, 28లో మోషేతో దేవుడు ‘‘మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధిjైున ఏ పనియు చేయుట మాని మిమ్మును మీరు దు:ఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు’’ అని చెప్పెను. మరియు లేవీకాం. 16:30,31లో ‘‘ఏలయనగా, ఆ దినము మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అది మీకు మహా విశ్రాంతి దినము. మిమ్మును మీరు దు:ఖపరచుకొనవలెను. ఇది నిత్యమైన ‘‘కట్టడ’’ అని ప్రభువు చెప్పెను. ఇప్పటికిని యోమ్ కిప్పుర్ అను ప్రాయశ్చిత్తార్థ దినమును ఉపవాస దినముగా యూదులు ఆచరించుదురు.
‘‘మన దేహమును లోబరచుకొనుటకు కూడా ఉపవాసము ఒక సాధనమైయున్నది. భౌతికమైన అవయవాలు వాటి ఆశలతో మన దేహాలకు అద్భుతమైన సేవకులుగా ఉన్నాను. అవి భయంకరమైన యజమానులుగా ఉండును’’ అని డెరిక్ ప్రిన్స్ వ్రాసిరి. కాబట్టి ఎల్లప్పుడు వాటిని మన స్వాధీనమందుంచుకొనవలసిన అవసరమున్నది.
ప్రార్ధన:- ప్రియ ప్రభువా, జయించుటకు నాకు నీ కృపననుగ్రహించుము. దురాశపరునిగా గానీ, మోసకరమై వాటిని ఆశింపకయు, లోకము, దాని సంబంధమైన వాటిని ఆశించువానిగా ఉండక, మనుష్యులకు భయపడక వారికంటె నీకు ఎక్కువగా భయపడి చింతలు, కలవరములను తొలగించుకొని పరసంబంధమైన వాటి మీదనే దృష్టియుంచుటకు సహాయము చేయుమని యేసు నామమున వేడుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com
Comments