top of page

01, నవంబర్ 2024 శుక్రవారము తేనెధారలు

Updated: Nov 1

చదువుము: కీర్తన 46:1-11



తుపానులో అతి సురక్షితప్రదేశము

‘‘యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తనయందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును’’ (నహూము 1:7)

ఈ లోకములో ఒకే ఒక్క సురక్షితమైన స్థలము ఆయన రెక్కల నీడయే. దీనినే బైబిలు, ‘‘నీతిమంతులు పరుగెత్తి దాగియుండు ఆశ్రయదుర్గము’’గాను ‘‘ఒక బలమైన కోటగాను’’, ‘‘ఒక పెద్ద బండ నీడ’’గాను చిత్రీకరించుచున్నది. చాలా సం॥ల క్రితం యోసెమైట్ లోయలో మాటిమాటికి భూకంపములు కలుగచుండెడిది. రాత్రి జాములలో అక్కడ నివసించువారు కొందరు వారి పడకల మీద నుండి పడిపోవుచు ఉండేవారు. అంత గట్టిగా లేని వారి ఇళ్ళు (గుడిసెలు) తలక్రిందులయేవి. ఆ ప్రకంపనలు మరల మరల కొన్ని దినాలు వచ్చుచుండెను గనుక జనులు భయభ్రాంతులైరి. అలాగైతే మీరెలా తప్పించుకొన్నారు ? అని వారినడిగితే, వారిలో ఒకరు ఒక భారీ కొండను చూపి ఈ ఎల్-కాప్టెన్ ఆ లోయకు దక్షిణ దిశగా మూడువేల అడుగుల ఎత్తులోను మూడు మైళ్ల పొడవున్నది గనుక మేము ఆ బండ క్రింద ఏర్పాటు చేయబడిన శిబిరములోకి వెళ్ళి లోకము తలక్రిందులైనను అది కదలనిది గనుక మేము సురక్షితముగా ఉందుము అని చెప్పెను.



ప్రియ మిత్రులారా, భూకంపముల వలెనే వివిధమైన తీవ్రతలలో అప్పుడప్పుడు మన జీవిత తుపానులు వచ్చుచుండును. తరచుగా అది ఏ సూచన లేకయే వచ్చి మన విశ్వాసమును పరీక్షించుచుండును. ‘‘దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునైయున్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పునొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను... మనము భయపడము’’ అని కీర్తనాకారుడు ధైర్యముగా చెప్పుచున్నాడు. (కీర్తన 46:1-2) దేవుడే మన క్షేమాధారము. సుడిగాలి వంటి పరిస్థితులను మార్చి మనలను కాయునది మన బలము కాదు గానీ ఆయన శక్తియే. గనుక మన ఊహకందని పరిస్థితిలోను మనము ఆయన మంచితనము నందు నమ్మికయుంచుదము. సమస్యల సుడిగాలలో ఆయన కాపుదల కొరకు ఎగిరి ఆయన రెక్కల నీడకు చేరుదము. మన పరిపూర్ణ కాపుదల కొరకు ఆయన ప్రేమగల రక్షణయందు నిశ్చయత కలిగి ఆయన మీదనే ఆనుకొందము.

ప్రార్దన :- మా దాగు చోటువైన ప్రభువా, జీవిత తుపానులు నన్న భయపెట్టునప్పుడు కాపుదల కొరకు నీ వద్దకు పరుగెత్తి వచ్చు కృపనిమ్ము. నీవే నా దాగుచోటు. నీ రెక్కల నీడన నేను దాగియుంటే శత్రువు నన్నేమి చేయలేడు. ఈ నమ్మికతోనే తుపానుల నెదుర్కొని జయించుటకు సహాయము చేయుమని యేసునామమున ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్.

 

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI - 59.

Office: +91 9444456177 || https://www.honeydropsonline.com

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page